IITలో చేరను MIT లో చదువుతా: JEE టాపర్ చిరాగ్ ఫాలోర్

IITలో చేరను MIT లో చదువుతా: JEE టాపర్ చిరాగ్ ఫాలోర్

JEE అడ్వాన్డ్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన  చిరాగ్ ఫాలోర్ …తాను IITలో చేరబోనని అంటున్నాడు. సోమవారం నాడు ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో పూణెకు చెందిన చిరాగ్ ఫాలోర్ కు ఆల్ ఇండియా ర్యాంక్ 12 వచ్చింది. దీంతో దేశంలోని ఏ ఐఐటీలోనైనా అతను కోరుకున్న బ్రాంచిలో సీటు గ్యారంటీగా లభిస్తుంది. అయితే, తాను ఐఐటీలో చేరాలని భావించడం లేదని, యూఎస్ లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లోనే చదువుతానని అంటున్నాడు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షలకు 1.60 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 1.50 లక్షల మంది వరకూ హాజరయ్యారు.

అయితే గత మార్చిలో తాను MIT లో ప్రవేశాన్ని పొందానని… కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయని, తాను ఎంఐటీలోనే కొనసాగుతానని చిరాగ్ స్పష్టం చేశాడు.వచ్చే ఏడాది జనవరిలో యూఎస్ కు వెళ్లి ఎంఐటీ విద్యను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.