మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌‌‌‌లను సన్మానించిన చిరంజీవి

మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌‌‌‌లను సన్మానించిన చిరంజీవి

పద్మశ్రీ విజేతలు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌‌‌‌లను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వీరిద్దరూ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం  సంతోషంగా ఉందని, ఇది తెలుగు సినిమాకు లభించిన జాతీయ గౌరవం అని చిరంజీవి అన్నారు. 

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘పద్మశ్రీ పురస్కారం రావడం నా అదృష్టం. తెలుగు ప్రజల ఆశీర్వాదంతోనే ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు నాది కాదు.. 48 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులది’ అని అన్నారు. పద్మశ్రీ అవార్డు రాకపై మురళీ మోహన్ స్పందిస్తూ..  తన 54 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌‌‌‌‌‌‌‌లో లేట్‌‌‌‌గా వచ్చినా లేటెస్ట్‌‌‌‌గా వచ్చిందని అన్నారు.