నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

చొప్పదండి బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, కాంగ్రెస్ గూండాల నుండి రక్షణ కల్పించాలన్నారు. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా మిడ్ మానేరు నిర్వాసితులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మళ్ళీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చారని నిలదీశారు. రవిశంకర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 

ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు స్పల్పంగా తోపులాట జరిగింది.   కావాలనే కాంగ్రెస్ నాయకులు తనను  డ్యామేజ్ చేసేందుకు వచ్చారని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలన్నారు.  బీఆర్ఎస్ నాయకుడు నాగి శేఖర్‌ను కూడా నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులు వెంటాడారని ఆరోపించారు.  ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని చూస్తుందని,  బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఆ పార్టీ నాయకులు  దాడులకు దిగుతున్నారని సుంకే రవిశంకర్ అన్నారు .