
చౌటుప్పల్, వెలుగు : పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పిఠాపురం నుంచి హైదరాబాద్ కబేళాకు డీసీఎం లో 16 ఆవులు, 12 కోడె దూడలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అరటి గెలలతో నిండుగా కప్పి కింద చెక్కలతో ఒక సెటప్ ఏర్పాటు చేసి ఆవులను తరలిస్తున్నారు.
పక్కా సమాచారంతో భజరంగ్ దళ్, గోరక్ష సమితి, చౌటుప్పల్ పోలీసులు మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోనిచిన్నారెడ్డిగూడెంకు చెందిన రామావత్ శరత్ కుమార్, దాసరి భగవాన్‌పై కేసు నమోదు చేశారు. ఆవులను హైదరాబాద్‌లోని గోశాలకు తరలించారు.