న్యూఢిల్లీ: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మృతితో ప్రపంచ వ్యాప్తంగా జాత్యాహంకార వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సెగ ఇంగ్లండ్‌లోని బోస్టన్‌కూ పాకింది. బోస్టన్‌లో ఇటాలియన్ అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహం తలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామని, ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. బోస్టన్‌తోపాటు మరోచోట కూడా కొలంబస్ స్టాచ్యూను నిరసనకారులు పడగొట్టారు. డౌన్‌టౌన్ మియామిలో ఉన్న కొలంబస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రేసిజం వ్యతిరేక నిరసనల నేపథ్యంలో వలసవాదులు, బానిసలను స్మరించే శిల్పాలను తొలగించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.
