
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లా ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.1,222 కోట్ల నికరలాభం సాధించింది. భారతదేశంతోపాటు యూఎస్, ఆఫ్రికాలో అధిక అమ్మకాల కారణంగా ఏడాది లెక్కన లాభం 30 శాతం పెరిగిందని ఈ ముంబై కంపెనీ తెలిపింది. గత ఏడాది నాలుగో క్వార్టర్లో సిప్లా రూ.939 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.6,730 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.6,163 కోట్లు వచ్చాయి.