సిప్లా చేతికి ఐవియా

సిప్లా చేతికి ఐవియా

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్.. ఐవియా బ్యూట్ ప్రైవేట్ లిమిటెడ్  సౌందర్య సాధనాలు,  వ్యక్తిగత సంరక్షణ పంపిణీ  మార్కెటింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తుంది. సంస్థ బ్రాండ్లు ఆస్టాబెర్రీ, ఇకిన్  భీమ్‌‌‌‌సైని కూడా సిప్లా చేతికి వస్తాయి. ఈ డీల్​ విలువ రూ. 130 కోట్లని  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​ ద్వారా తెలిపింది. 

ఐవియా  సౌందర్య సాధనాలు,  వ్యక్తిగత సంరక్షణ వ్యాపారం,  పంపిణీ  మార్కెటింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి వ్యాపార బదిలీ ఒప్పందం (బీటీఏ)పై సంతకం చేసినట్టు సిప్లా తెలిపింది.  దీనివల్ల సిప్లా కన్జూమర్​హెల్త్​కేర్​,  వెల్‌‌‌‌నెస్ పోర్ట్‌‌‌‌ఫోలియో మరింత బలోపేతం అవుతుందని పేర్కొంది.  ఈ డీల్​ పూర్తి కావడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని భావిస్తున్నారు.