
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ఢిల్లీ మెట్రో యూనిట్ లో 13 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో సీఐఎస్ఎఫ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48 కి చేరుకుంది. ఇందులో ఎక్కువగా ఢిల్లీ మెట్రో యూనిట్ లో పనిచేసేవారు కాగా.. ఆ తర్వాత ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు గార్డింగ్ యూనిట్లో పనిచేసేవారని తెలిపారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ముగ్గురు, అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది.