Samantha: సిటాడెల్‌ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత

Samantha: సిటాడెల్‌ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత

ఏడాది బ్రేక్ అనంతరం తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొనేందుకు సమంత సిద్ధమైంది. దానికంటే ముందు తాను ఇప్పటికే నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో ఈ బ్యూటీ పాల్గొంటోంది. రీసెంట్ గా సిటాడెల్‌ ప్రమోషన్ లో పాల్గొన్న సమంత.. ఆ సినిమా షూటింగ్ సమయంలో తన అనుభవాలను పంచుకుంది.

ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు తాను చాలా బలహీనంగా ఉన్నట్లు తెలిపింది. మయోసైటిస్ కారణంగా తన బలం 50 శాతం కు పడిపోయినట్లు వెల్లడించింది. అయినప్పటికీ సిటాడెల్‌ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నట్లుగా పేర్కొంది. ఇమ్యూనిటీ లేక  ఇబ్బంది పడుతున్నా సిటాడెల్‌ షూటింగ్‌ లో పాల్గొన్నట్లుగా సమంత తెలిపింది. ఆ సమయంలో తన వీక్ నెస్ బయటకు తెలియకుండా చూసుకున్నట్లుగా పేర్కొంది.

గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత..త్వరలో సిటాడెల్ వెబ్‌ సిరీస్ తో రానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.