
హైదరాబాద్, వెలుగు : తమ స్మార్ట్వాటర్ మీటర్లను వాడితే 25 శాతం నీరు ఆదా అవుతుందని నగరానికి చెందిన స్మార్ట్హోమ్స్ప్రకటించింది. ఇది వాటర్‌ఆన్ పేరుతో మీటర్లను అమ్ముతోంది. హైదరాబాద్‌లోని అనేక అపార్ట్‌మెంట్ సముదాయాలు నీటి వృథాను తగ్గించడానికి స్మార్ట్ వాటర్ మీటర్లకు మారుతున్నాయని తెలిపింది. ఈ స్మార్ట్ వాటర్ మీటర్లను మొబైల్‌తో కంట్రోల్ చేయవచ్చు. నీటి వినియోగం, సంబంధిత బిల్లులు, లీకేజీ హెచ్చరికల గురించిన సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల కోసం ప్రత్యేకంగా వాటర్‌ఆన్ ను రూపొందించామని స్మార్ట్హోమ్స్తెలిపింది.