
- సర్వీసులు పెంచాలని రైల్వే అధికారులకు రిక్వెస్టులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు దొరకడం లేదు. నెల రోజుల ముందు బుక్‌చేసుకున్నా వెయిటింగ్ లిస్ట్ఉంటోంది. అప్పటికప్పుడు జర్నీ అనుకుంటే టికెట్లు దొరికే పరిస్థితి లేదు. రెండు నెలలు, కొన్ని ప్రాంతాలకు మూడు నెలల ముందే బుక్‌చేసుకోవాల్సి వస్తోంది. సౌత్, నార్త్ ఇండియాలోని టూరిస్టు ప్లేసులకు రైళ్లలో వెళ్లాలంటే రెండు, మూడు నెలల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. 15, నెల రోజుల ముందు డిసైడ్అవుతున్నవారికి టికెట్లు దొరకక పోస్ట్పోన్చేసుకుంటున్నారు. కొందరు వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్నా జర్నీకి ఒకరోజు ముందు వరకు చూస్తున్నారు. అప్పటికీ కన్ఫామ్కాకపోవడంతో క్యాన్సిల్చేస్తున్నారు. తాత్కాల్లోనూ చాలా ట్రైన్లకు దొరకడం లేదు. దీంతో టూర్లనే పోస్ట్పోన్చేసుకుంటున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ఢిల్లీ, నాగ్ పుర్, పట్నా, రాక్ సోల్, బిహార్, దర్భంగా, హౌరా, జైపూర్, ఇండోర్, రాజ్ కోట్, గౌహతి, తిరుపతి, వైజాగ్, విజయవాడ, చెన్నై, మధురై, ముంబై, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లోని ఒకటి, రెండు ప్రాంతాలకు మినహా ఈ నెలలో టికెట్లు అందుబాటులో లేవు. ఆన్ లైన్‌పై అవగాహన ఉన్నవారు తాత్కాల్లో ట్రై చేస్తున్నారు. లేనివారితోపాటు, సర్వీస్‌చార్జీలు ఎందుకు చెల్లించాలనుకునేవారు రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్తున్నారు. రిజర్వేషన్ ఫాం ఫిల్ చేసి కౌంటర్ లో ఇచ్చాక వెయిటింగ్లిస్ట్ఉందని తెలిసి వెనుదిరుగుతున్నారు.
రైళ్లలోనే ఎక్కువ మంది
సిటీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లనే ఆశ్రయిస్తారు. అతి తక్కువ మంది ఫ్లైట్లలో వెళ్తుంటే దాదాపు 90 శాతం మంది ట్రైన్లలోనే వెళ్తున్నారు. టికెట్లు దొరకపోతే జర్నీని పోస్ట్పోన్చేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవెట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కుతున్నారు. ఫ్లైట్లు, బస్సుల్లో కంటే రైళ్లలో జర్నీ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీంతో రైళ్లలో ఎప్పుడూ రష్ఉంటోంది. స్కూళ్లు, కాలేజీలు, పండుగ సెలవుల్లో రైళ్లలో వెయిటింగ్లిస్ట్చాంతాడంత ఉంటోంది.
స్పెషల్ ట్రైన్లు వేస్తున్నా..
జనం అవసరాన్ని బట్టి స్పెషల్ ట్రైన్లు వేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నా, చాలా ప్రాంతాలకు సరిపోవడం లేదు. ఒక రూట్లో ట్రైన్ తిప్పాలంటే ఆ రూట్ లో రెగ్యులర్ గా 1,500 నుంచి 2 వేల మంది ప్రయాణించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరీ ఎక్కువగా ఉంటే స్పెషల్ ట్రైన్స్ వేస్తున్నామని అంటున్నారు. కొత్త సర్వీసులు నడపాలంటే బోర్డు నిర్ణయం తీసుకోవాలంటున్నారు.
వెయిటింగ్ లిస్ట్ వచ్చింది
ఫ్రెండ్స్ తో కలసి ఈ నెల 8న తిరుపతి వెళుతున్నం. ట్రైన్టికెట్లు తీసుకుందామని నాంపల్లి రిజర్వేషన్ కౌంటర్ కి వచ్చాను. వెయిటింగ్ లిస్ట్ ఉంది. కన్ఫామ్అవుతుందో లేదో చెప్పలేమని రైల్వే సిబ్బంది చెప్పారు. కన్ ఫాం అయితే ఓకే. లేకుంటే బస్సులో వెళ్లాలి.
- కాస్తిపురం మల్లికార్జున్, సిటిజన్
టూర్ పోస్ట్ పోన్ చేసుకున్నం
నార్త్ ఇండియా టూర్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటే రైళ్లలో టికెట్లు దొరకడం లేదు. నెల రోజుల ముందు ప్లాన్ చేసుకున్నా వెయిటింగ్లిస్ట్తగ్గడం లేదు. మరో రెండు నెలల తరువాత వెళ్దామని అనుకుంటున్నా. మా బ్యాచ్‌లో చాలా మందికి బస్‌జర్నీ పడదు. అందుకే ట్రైన్ టికెట్ల కోసం చూస్తున్నాం.
- ధరమ్, సిటిజన్