సిటీ ట్రీస్​.. పొల్యూషన్​ రిలీఫ్​

సిటీ ట్రీస్​.. పొల్యూషన్​ రిలీఫ్​

సిటీ అంటేనే కాంక్రీట్​ జంగిల్​. ఎక్కడో కాలనీల్లో గానీ పచ్చటి చెట్లు కనిపించే పరిస్థితి లేదు. దానికి తోడు పొల్యూషన్​. స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితే లేదు. మరి, దానికి విరుగుడు లేదా..? ఇదిగో ఇంగ్లాండ్​ రాజధాని లండన్​ మంచి పరిష్కారాన్ని చూపించింది. చెడు గాలిని పీల్చేసి స్వచ్ఛమైన గాలినిచ్చేందుకు ఈ ‘సిటీ ట్రీస్​’ను పెట్టింది. లండన్​లోని వాల్దమ్​ ఫారెస్ట్​ మున్సిపాలిటీలో వీటిని పెట్టారు.

పొల్యూషన్​ను ఫిల్టర్​ చేసేలా వాటిలో మోసెస్​ (గడ్డి లేదా నాచు లాంటి చిన్న చిన్న మొక్కలు)ను పెట్టారు. ఒక్కో యూనిట్.. 275 చెట్లు ఇచ్చే లాభాలను ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎవర్​గ్రీన్​ అనే సంస్థతో కలిసి ఈ సిటీ ట్రీస్​ను పెట్టింది మున్సిపాలిటీ. వీటిని బయోటెక్​ ఫిల్టర్లుగా చెబుతున్నారు. అంతేకాదు, ప్రపంచంలో పెట్టిన ఫస్ట్​ బయోటెక్​ ఫిల్టర్లుగానూ మున్సిపాలిటీ అధికారులు ప్రమోట్​ చేస్తున్నారు. ఈ ఫిల్టర్​లో పెట్టిన మోసెస్​, కాలుష్య కారకాలను పీల్చేసి, గాలిని స్వచ్ఛంగా మార్చేస్తుందని చెబుతున్నారు.  ఇందులో వాటర్​ ట్యాంకు, ఇరిగేషన్​ సిస్టమ్స్​తో పాటు మోసెస్​ పెరుగుదలను ఎప్పటికప్పుడు చెక్​చేసే సెన్సర్లనూ ఏర్పాటు చేశారు. అది పనిచేసేందుకు అవసరమయ్యే పవర్​ కోసం వాటిలో బ్యాటరీలతో పాటు సోలార్​ పానెళ్లను పెట్టారు. ఆ పవర్​ను వాడుకుంటూ గాల్లోని కార్బన్​ డయాక్సైడ్​, నైట్రోజన్​ ఆక్సైడ్​ పొల్యూటెంట్లను సిటీ ట్రీస్​ తీసేస్తాయి. గత ఏడాది ఏప్రిల్​లో వాల్దమ్​ ఫారెస్ట్​ ఏరియాలో పొల్యూషన్​ కారణంగా ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అందుకే కాలుష్యం నుంచి జనానికి రిలీఫ్​ ఇచ్చేలా ఇప్పుడు ఈ సిటీ ట్రీస్​ను ఏర్పాటు చేశారన్నమాట.