
- మిల్లుల్లో తనిఖీలు చేసి, సీఎంఆర్ వివరాలు సేకరించిన ఆఫీసర్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో జరిగిన అవకతవకలపై సివిల్సప్లయ్విజిలెన్స్ విచారణ షురూ చేసింది. ఆరోపణలు వస్తున్న కొనుగోలు సెంటర్‌తో పాటు మిల్లులను సోమవారం అధికారులు సందర్శించారు. కొనుగోలు సెంటర్లో వడ్ల అమ్మకాలపై ఆరా తీశారు. మిల్లుల్లో సీఎంఆర్డిటెయిల్స్, వడ్ల స్టాక్ తనిఖీ చేశారు. యాసంగి సీజన్లో వడ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
వలిగొండ మండలం సంగెంలోని పీఏసీఎస్ కొనుగోలు సెంటర్ లో 500 బస్తాల వడ్లను కొనుగోలు చేసినట్టుగా రికార్డులు ఉండగా.. రూ. 4.64 లక్షలు సొంత అకౌంట్లలో జమ చేసుకున్నట్టు సివిల్సప్లయ్ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిసెంటర్ఇన్ చార్జ్, అసిస్టెంట్ ఇన్చార్జ్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 4.14 లక్షలు రికవరీ కూడా చేశారు. పీఏసీఎస్ సీఈవో ముత్యాలుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
కాగా జిల్లాలో వడ్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సివిల్సప్లయ్ విజిలెన్స్ ఓఎస్డీ అంజయ్య, ఏసీపీ యాదయ్య, కమాల్పాష సోమవారం సంగెం సెంటర్ లో వడ్లు అమ్మిన జాబితాలోని పలువురు రైతులను కలిశారు. వడ్లు అమ్మారా..? డబ్బులు వచ్చాయా..? అని ఆరా తీశారు. అయితే 500 బస్తాల అక్రమాలపై నిర్ధారణకు వచ్చారు. అనంతరం సంగెం కొనుగోలు సెంటర్‌నుంచి వడ్లు వెళ్లిన ధాన్యలక్ష్మి, సోమేశ్వర మిల్లులను సందర్శించి వడ్ల నిల్వలను తనిఖీ చేశారు.
సీఎంఆర్ కోసం వచ్చిన వడ్ల స్టాక్ వివరాలతో పాటు పెండింగ్సీఎంఆర్, టెండర్వడ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని సివిల్సప్లయ్ఆఫీసుకు వెళ్లి విజిలెన్స్ ఆఫీసర్లు డీఎం హరికృష్ణను కలిశారు. ఆర్ఆర్యాక్ట్ నమోదు చేసిన ఎల్ఎన్ రెడ్డి, లక్ష్మి ఇండస్ట్రీస్ మిల్లులపై ఆరా తీశారు. వీటికి సంబంధించిన కేసు వివరాలను తీసుకొని, కేసు స్టేటస్, కోర్టులో కౌంటర్ దాఖలుపైనా అధికారులను ప్రశ్నించారు.
రూ. 10 కోట్లు చెల్లించాల్సిన డిఫాల్ట్మిల్లు ఎల్ఎన్ఆగ్రోపైనా ప్రశ్నించారు. ఆ మిల్లులో కేవలం 4200 టన్నుల టెండర్ వడ్లు మాత్రమే ఉన్నాయని, వాటిని వేలం వేయడానికి స్టేట్ఆఫీసు అనుమతి కోరినట్టు డీఎం తెలిపారు. ఆయా మిల్లుల ఆస్తులను అమ్మకుండా ఫ్రీజ్చేయించినట్టు వివరించారు. మిల్లుల ఆస్తుల వివరాలను విజిలెన్స్ఆఫీసర్లు అడిగి తెలుసుకుని అనంతరం కేసుల డాక్యుమెంట్స్ తో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.