
హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. క్లాస్ మేట్ (అమ్మాయి) విషయంలో.. ముగ్గురు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ విద్యార్థి… ఆవేశంతో తోటి విద్యార్థులైన మరో ఇద్దరిపై బీరు బాటిల్ తో దాడి చేశాడు. గాయాలతో ఇద్దరు విద్యార్థులు… హాస్పిటల్ లో చేరారు. దాడిచేసిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ పై పోలీసులు కేసు పెట్టారు.
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు ప్రభు, సురేశ్, గణేశ్ అనే విద్యార్థులు. అదే స్కూల్లో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయితో సురేష్ చనువుగా మాట్లాడటం చూసి ప్రభు తట్టుకోలేకపోయాడు. మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చినా.. మాట్లాడేసరికి ప్రభు సహనం కోల్పోయాడు. ఇవాళ మధ్యాహ్నం స్కూల్ ఆవరణలో.. ప్రభు…. సురేష్ కడుపు భాగంలో బీర్ బాటిల్ తో పొడిచాడు. గొడవ అడ్డుకున్న గణేశ్ పైనా ప్రభు దాడి చేశాడు. గణేశ్ మెడపై బీర్ బాటిల్ తో పొడిచాడు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సురేశ్, గణేశ్ లను స్థానిక ప్రైవేటు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. స్టూడెంట్ ప్రభుపై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు విద్యార్థిపై కేసు పెట్టారు.