
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్రలో డ్యాన్సులు చేస్తుండగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సంబు రాజు, పురెల్ల మల్లిఖార్జున్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం రాజు, మల్లికార్జున్ లను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.