పరీక్ష హాలులో విద్యార్థినిలను చూసి స్పృహతప్పిన విద్యార్థి

పరీక్ష హాలులో విద్యార్థినిలను చూసి స్పృహతప్పిన విద్యార్థి

12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి... పరీక్ష రాసేందుకు వెళ్లి స్పృహతప్పి పడిపోయాడు. అయితే అతను పడిపోయింది పరీక్ష అంటే భయపడో.. మరో కారణంచేతనో కాదు.. గది నిండా ఉన్న విద్యార్థినులను చూసి. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బిహార్ లోని బ్రిలియంట్ స్కూల్‌లో జరిగింది. షరీఫ్ అల్లామా ఇక్బాల్ కాలేజీకి చెందిన మనీశ్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వెళ్లి గది నిండా ఉన్న దాదాపు 50 అమ్మాయిలను చూసి, పరీక్ష హాల్‌లోనే భయంతో మూర్ఛపోయాడని సమాచారం. అయితే అతని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ విద్యార్థికి జ్వరం కూడా రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి అంత మంది విద్యార్థినులను చూడగానే మనీశ్‌ కంగారుపడి స్పృహ తప్పిపోయాడని అతడి మేనత్త వెల్లడించారు.