కర్నాటకలో 60 స్థానాల్లో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు

కర్నాటకలో 60 స్థానాల్లో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు

ఆ పార్టీ మళ్లీ ఘోరంగా ఓడిపోతుంది: సీఎం బొమ్మై 

శివమొగ్గ : కర్నాటకలో దాదాపు 60 స్థానాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరైన అభ్యర్థులే లేరని, మే 10న జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్​లో ఆ పార్టీ కిందటిసారి కంటే ఘోరంగా ఓడిపోతుందని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అభ్యర్థులే కాదు.. రాష్ట్రంలో సరైన పునాది లేదని, విధి విధానాలపై స్పష్టత కూడా లేదని ఆయన కామెంట్​ చేశారు. "నా అవగాహన ప్రకారం అరవై సెగ్మెంట్లలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరైన అభ్యర్థులు లేరు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి క్యాండిడేట్స్​ను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని బొమ్మై ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

"నేను ముందే చెప్పినట్లు, కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ కాంగ్రెస్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నప్పుడు దాదాపు మా ఎమ్మెల్యేలందరినీ సంప్రదించారు. మీకు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.. మీరు పార్టీలో చేరుతారా? అని అడిగారు" అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు, శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నారని, కానీ లోపల వాస్తవం వేరేగా ఉందని బొమ్మై ఎద్దేవా చేశారు. "ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎన్నికల్లో గెలుస్తాం అని వారు భావిస్తున్నారు. కానీ, అది సాధ్యం కాదు" అని బొమ్మై పేర్కొన్నారు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 166 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన 58 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.