అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ

అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ

కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో మార్చి 17న ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఆయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం అమిత్‌ షాతో ఢిల్లీలో సమావేశమైయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షాకు వివరించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే, అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. 

14 అంశాలతో కూడిన వినతి పత్రం అమిత్ షా కు  అందించారు సీఎం జగన్. ఇక, ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కాగా, అంతకుముందు ప్రధాని మోదీతో జగన్‌ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు.