కృష్ణా నది కరకట్ట నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన 

కృష్ణా నది కరకట్ట నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన 

•    రూ.150 కోట్లతో కొత్త కరకట్ట నిర్మాణం
•    ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ మేర విస్తరణ

అమరావతి:
కృష్ణా నదిపై కరకట్ట నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి, కొండవీటి వాగు సమీపంలో పైలాన్ ను ఆవిష్కరించారు. కరకట్ట నిర్మాణంలో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత కొండవీటివాగు ఎత్తిపోతల పధకం వద్ద నుంచి రాయపూడి వరకూ 15.525 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబిలిటీ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించి కరకట్ట నిర్మాణం మొదలుపెట్టారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీనే ఈ పనులు చేపడుతోంది. కరకట్ట విస్తరణలో భాగంగా పాదచారులు నడిచేందుకు వీలుగా రోడ్లకు రెండు వైపులా ఒకటిన్నర మీటర్ల మేర ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.