సీఎం జగన్ మరో బటన్ నొక్కారు: వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల

సీఎం జగన్ మరో బటన్ నొక్కారు:  వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ శనివారం ( సెప్టెంబర్ 16)న నిడదవోలులో  వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగో విడతలో భాగంగా బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేశారు. అర్హులైన 3 లక్షల 57 వేల 844 మంది లబ్దిదారులకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. సభా వేదికపై సిఎం జగన్‌ మాట్లాడుతూ ... అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అందరి ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నామని తెలిపారు. వరుసగా ఐదేళ్లపాటు 75 వేల రూపాయిలు  ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం  తెలిపారు. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరిందని, 45 నుంచి 60 ఏళ్ల అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచామని ముఖ్యమంత్రి తెలిపారు.