సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు 

సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు 

ఏపీ సీఎం జగన్  అనంతపురం పర్యటన రద్దు అయింది. అనివార్య కారణల వలన జగన్ టూర్ రద్దు అయినట్లుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి వెల్లడించారు.  వాస్తవానికి ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును  జమ చేయాలనీ సీఎం జగన్ అనుకున్నారు. కానీ అనివార్య కారణల వలన ఈ కార్యక్రమం రద్దు అయింది.

సీఎం జగన్ పర్యటన రద్దైన క్రమంలో తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ గౌతమి  తెలిపారు. సీఎంఓ నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత జగనన్న వసతి దీవెన కార్యక్రమం తేదీని ప్రకటిస్తామని తెలిపారు.