హైద‌రాబాద్ తాగునీటి సమ‌స్య తీర్చే ప్రాజెక్ట్

హైద‌రాబాద్ తాగునీటి సమ‌స్య తీర్చే ప్రాజెక్ట్

హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సమస్యను తీర్చే ప్రాజెక్టు మల్ల‌న్న సాగ‌ర్ అన్నారు సీఎం. సింగూరు ప్రాజెక్టును తలదన్నెలా మల్లన్నసాగర్‌ నిర్మాణం చేపట్టామ‌న్నారు. 20లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకుని కాపాడే ప్రాజెక్టు మ‌ల్ల‌న్న సాగ‌ర్ అన్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్నీ ప్రయత్నాలు చేశారన్నారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు గులాబీ బాస్. 
చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా పరిహారం ఇచ్చామ‌న్నారు. ఇంకా ఎవరైనా ఉంటూ వారికీ పరిహారం అందించాలన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగాలని కోరుకోను అన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. 

పాలమూరు జిల్లాలోనూ ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. తెలంగాణకు కరువు రాకుండా ప్రాజెక్టే కాళేశ్వరం అని కొనియాడారు సీఎం. దేశానికి కరువు వచ్చినా.. తెలంగాణలో మాత్రం క‌రువు రాద‌న్నారు. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటుంది? అన్నారు సీఎం. దేవాదుల పాజెక్టునూ కంప్లీట్‌ చేసుకున్నామ‌న్నారు. జూబ్లిహీల్స్లో తాగే నీరు.. ఆదిలాబాద్ లో కూడా తాగాల‌న్నారు సీఎం. మంచినీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగాదూరం చేసే ప్రాజెక్టు మ‌ల్లన్న సాగ‌ర్ అన్నారు.

ప్రాజెక్టులు క‌ట్టిన‌ప్పుడు కొన్ని భూములు మునిగిపోయాయ‌న్నారు. నా క్లాస్ మేట్స్ ఉన్న గ్రామాలు కూడా మునిగాయ‌న్నారు. అయినా కూడా త‌ప్ప‌దన్నారు సీఎం.  కాళేశ్వ‌రంతో 13 జిల్లాల‌కు తాగు సాగు నీరు అందిస్తున్ఆన‌మ‌న్నారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి వారికి క‌డుపు నిండా ప‌రిహారం ఇవ్వాల‌ని అధికారుల్ని ఆదేశించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో పెద్ద జ‌లాశ‌యం మ‌ల్ల‌న్న సాగ‌ర్ అన్నారు ముఖ్య‌మంత్రి. 

ఇవి కూడా చ‌ద‌వండిః

దేశంలో దుర్మార్గ‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి

థమ్స్ అప్ కొత్త యాడ్ లో షారుక్ ఖాన్