కొండపోచమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్

కొండపోచమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్

సిద్దిపేట :  సీఎం కేసీఆర్‌ దంపతులు కొండపోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం చండీయాగం పూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొంటారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ‌ను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వాయర్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మర్కూక్‌ పంప్‌ హౌజ్ ‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీగుల్‌ నర్సాపూర్‌ లోని కొండపోచమ్మ దేవాలయం ఆవరణలో చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు యాగం ప్రారంభమైంది.

ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్‌ పంప్‌ హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు,  చినజీయర్‌ స్వామీ పాల్గొంటారు.  ఉదయం 11:30 గంటలకు మర్కూక్‌ పంప్ ‌హౌస్ ‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇవాళ కొండపోచమ్మ సాగర్‌‌‌‌కు నీళ్లు