సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

హైదరాబాద్: నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయ నిర్మాణ పనుల తీరుతెన్నులను గురువారం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు అధికారులను సీఎం అభినందించారు.  

మంత్రి వేముల రెడ్డితోపాటు ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీ ఇంజనీర్లతో పనుల గురించి కేసీఆర్ చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేశారు. కారిడార్లు, గ్రౌండు ఫ్లోరు, మొదటి  ఫ్లోరుతో పాటు నిర్మాణంలో ఉన్న సచివాలయ ప్రాంగణమంతా కేసీఆర్ కలియతిరిగారు. తుది దశ నిర్మాణంలో చేపట్టాల్సిన ఎలివేషన్, తదితర ఫైనల్ వర్కుల కోసం తగు సూచనలు  చేశారు.