కాంగ్రెస్ బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం చేసింది: కేసీఆర్

కాంగ్రెస్ బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం చేసింది: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని.. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూడాలని చెప్పారు. గతంలో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. బలవంతంగా మనల్ని ఏపీలో కలిపారని వ్యాఖ్యానించారు. 2004లో కాంగ్రెస్ పొత్తుపెట్టుకొని మోసం చేసిందని.. 2005లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే బాగుపడేవాళ్లమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ వెనకబడ్డ ప్రాంతమని... ఆలోచించి ఓట్లేస్తే.. ఐదేండ్లు భవిష్యత్ బాగుంటుందని కేసీఆర్ చెప్పారు.