
రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వందల మంది బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఎందుకు రాష్ట్రం సాధించుకున్నామా అని బాధపడే రోజులొచ్చాయన్నారు నారాయణ.