నన్ను టచ్ చేసి బతికి బట్టకట్టగలరా..?

నన్ను టచ్ చేసి బతికి బట్టకట్టగలరా..?

తనను జైలుకు పంపిస్తామంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు సీఎం. కేసీఆర్ ను టచ్ చేసి చూడు అంటూ మాట్లాడారు. తనను టచ్ చేసి బతికి బట్టకట్టగలరా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి నేతపై అడ్డుపొడుగు మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ నేతలు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. 

నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం ఇప్పటికి 50 లెటర్లు రాశానన్నారు సీఎం. కొత్త జిల్లాలకు ఒక్కటి కూడా నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు. కనీసం మెడికల్ కాలేజీలను కూడా కేంద్రం సాంక్షన్ చెయ్యలేదని మండిపడ్డారు. దీనిపై బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. పెట్రోల్ పై సెస్ తగ్గించాలని, తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే వడ్లు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. కేసీఆర్ బతికుండగా తెలంగాణ రైతులను ఎవరూ నాశనం చెయ్యలేరన్నారు.