ఆఫీసర్ల ఆశలు గల్లంతు.. ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వని సీఎం కేసీఆర్

ఆఫీసర్ల ఆశలు గల్లంతు..  ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వని సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిం చిన ఆఫీసర్లను కేసీఆర్ నిరాశపరిచారు. టికె ట్ కోసం సిన్సియర్‌‌‌‌గా ప్రయత్నిస్తూ, నియోజకవర్గంలో కేడర్‌‌‌‌ను తయారు చేసుకున్న అధికారులకు అవకాశం ఇవ్వలేదు. సుమారు పది మంది ఆఫీసర్లు అధికార పార్టీ టికెట్‌‌పై ఆశలు పెట్టుకోగా, ఒక్కరికి కూడా కేసీఆర్ చాన్స్ ఇవ్వలేదు. టికెట్ ఆశించిన ఆఫీసర్లలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ముందు వరుసలో ఉన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌‌ను ఆయన ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు వయసు మీద పడడం, ఆయన కొడుకు రాఘవపై అనేక ఆరోపణలు ఉండడంతో టికెట్‌‌పై డీహెచ్‌‌ ఆశలు పెంచుకున్నారు. డైరెక్టర్‌‌‌‌గా కొనసాగుతూనే కొత్తగూడెంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌‌‌‌ను పోగు చేసుకున్నారు. 

ఈ క్రమంలో వనమాపై అనేక సార్లు డీహెచ్ విమర్శలు గుప్పించారు. వనమా కూడా డీహెచ్‌‌పై ఆరోపణలు చేయడంతో పాటు, సీఎం కేసీఆర్‌‌‌‌కు, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌ రావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా, ప్రభుత్వ పెద్దలు డీహెచ్‌‌ను వారించే ప్రయత్నం చేయలేదు. ఇదే స్థానం నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైతం టికెట్ ఆశించారు. కానీ, చివరకు వనమా వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. ఇక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉండడం, వనమాను పక్కన పెడితే పార్టీలో చీలికలు వచ్చే ప్రమాదం ఉండడంతోనే కేసీఆర్‌‌‌‌ ఆయనకే టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

ఉద్యోగం పాయే.. టికెట్ రాకపాయే

ఖానాపూర్ బీఆర్‌‌‌‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌‌ భర్త శ్యామ్‌‌ నాయక్‌‌ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశిం చారు. భార్యకు ఖానాపూర్ టికెట్‌‌, తనకు ఆదిలాబా ద్ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. టికెట్‌‌ వస్తుం దన్న నమ్మకంతో మోటార్ వెహికల్​ ఇన్​స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రచారం మొదలుపెట్టారు. అను హ్యంగా రేఖా నాయక్‌‌కు కూడా కేసీఆర్ టికెట్ నిరాకరించి, జాన్సన్‌‌ నాయక్‌‌ అనే ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ టికెట్ కేటాయించారు. దీంతో తనకు కూడా టికెట్ రాదు అని భావించిన శ్యామ్‌‌ నాయక్‌‌ కాంగ్రెస్‌‌ గూటికి చేరారు. ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం, ఆమె ఖానాపూర్ టికెట్ కోసం కాంగ్రెస్‌‌కు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌‌‌‌గా రిటైర్డ్ అయిన నాగరాజు సైతం బీఆర్‌‌‌‌ఎస్ నుంచి వర్దన్నపేట్ టికెట్ ఆశించారు. అధిష్టానం వైపు నుంచి స్పందన లేకపోవడంతో టికెట్ల ప్రకటనకు ముందే కాంగ్రెస్‌‌లో చేరారు.

బోథ్‌‌లో మస్తు పోటీ

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో, పలువురు ఆఫీసర్లు ఈ నియోజకవర్గంపై కన్నేశారు. జాయింట్ ట్రాన్స్‌‌పోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్‌‌, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్, డాక్టర్ జయసింగ్ రాథోడ్‌‌ బోథ్‌‌ టికెట్‌‌పై ఆశలు పెట్టుకున్నారు. శ్యామ్ నాయక్ సైతం ఆదిలాబాద్ ఎంపీ ఇవ్వకపోతే, కనీసం బోథ్ ఎమ్మెల్యే టికెట్ ఇయ్యాలని గతంలో కేసీఆర్‌‌‌‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. వీళ్లెవరినీ కేసీఆర్‌‌‌‌ పరిగణలోకి తీసుకోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్‌‌ బాపురావును కూడా పక్కకు పెట్టి, కేటీఆర్ సన్నిహితునిగా పేరున్న అనిల్ జాదవ్‌‌ను క్యాండిడేట్‌‌గా ప్రకటించారు.

ఫలించని విధేయత

ఉద్యోగ సంఘాల నేతలకు కూడా కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. టీఎన్‌‌జీవో ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్‌‌ సంగారెడ్డి నుంచి‌‌, మరో నేత ముజీబ్‌‌ రాజేంద్ర నగర్‌‌‌‌ నుంచి బీఆర్‌‌‌‌ఎస్ టికెట్లు ఆశించారు. ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమైనా, ప్రభుత్వ పెద్దలతో సానుకూలంగా ఉంటూనే పనులు చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్ భజన సంఘాలుగా మారిపోయాయని ప్రతిపక్షాలు విమర్శించినా భరించారు. మోటార్ వెహికల్ ఇన్‌‌స్పెక్టర్ చక్రవర్తి గౌడ్ కామారెడ్డి నుంచి, చంచల్‌‌గూడ జైలర్ శివ కుమార్ గౌడ్ జుక్కల్ నుంచి, వక్ఫ్‌‌ బోర్డు ఇన్​చార్జ్ సీఈవో ఖాజా మొయినుద్దీన్ మహబూబ్‌‌నగర్ టికెట్, మాజీ డీజీపీ మహేందర్‌‌‌‌ రెడ్డి పాలేరు లేదా కోదాడ నుంచి టికెట్ ఆశించారు. వీళ్లెవరికీ కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు.