
సెక్రటేరియట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. మినిస్టర్ల చాంబర్లు, పార్కింగ్ ఏరియా, సెక్రటరీ, వీఐపీల చాంబర్లను చూసి అధికారులకు పలు సూచనలిచ్చారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. కారిడార్లు సహా గ్రౌండు ఫ్లోరు, మొదటి ఫ్లోరు, నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ ప్రాంగణమంతా కలియదిరిగారు.
హైదరాబాద్ , వెలుగు: కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరగా అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నాణ్యతలో రాజీపడొద్దన్నారు. గురువారం సెక్రటేరియట్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కొనసాగుతున్న పనులను అధికారులు, ఇంజనీర్లు వివరించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీల చాంబర్లు, వీఐపీల చాంబర్లను పరిశీలించిన సీఎం.. అధికారులకు సూచనలిచ్చారు. కారిడార్లు సహా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ ప్రాంగణమంతా కలియతిరిగారు. తుది దశ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులతోపాటు, ఎలివేషన్ మోడళ్ల నాణ్యతను పరిశీలించారు. సెక్రటేరియట్ పనులపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
స్కూళ్ల సౌలత్లపై సీఎం రివ్యూ
స్కూళ్లు, కాలేజీల్లో సౌలత్‌ల కోసం రాష్ట్ర సర్కార్ తీసుకొస్తున్న రూ.2వేల కోట్ల స్కీమ్‌పై సబ్ కమిటీ రిపోర్టును వచ్చే కేబినెట్ మీటింగ్‌లో పెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాల విభజన జరిగిన నేపథ్యంలో జిల్లాల వారీగా విద్యాసంస్థల మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ జిల్లాలో ఏ విద్యాసంస్థలున్నాయి..? ఇంకా ఏమైనా అవసరమా..? అనే వివరాలను ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. దీన్నిబట్టి ఫ్యూచర్ అవసరాలకు అనుగుణంగా కొత్త సంస్థల ఏర్పాటుకు అవకాశముందని చెప్పినట్టు సమాచారం.