కేసీఆర్ మీటింగ్కు ఖమ్మం ఎమ్మెల్యేల డుమ్మా

కేసీఆర్  మీటింగ్కు ఖమ్మం ఎమ్మెల్యేల డుమ్మా

ప్రగతిభవన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామానాగేశ్వర్‌రావు తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి  హాజరయ్యారు. ఈ నెల 18న నిర్వహించే భారీ బహిరంగ సభ, జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ భేటీకి కొత్తగూడెం, పాలెరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, కందా ఉపేందర్ డుమ్మా కొట్టారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడతారన్న చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

కేసీఆర్ జిల్లాల టూర్

మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్‌‌, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 18న ఖమ్మం కలెక్టరేట్‌‌ను ప్రారంభించి.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు. ఈ సభకు మహబూబాబాద్‌‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు, కార్యకర్తలను సమీకరించనున్నారు.