
ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టునుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర వెళ్లిన సీఎం కేసీఆర్… మధ్యాహ్నం ముంబై చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలను విద్యాసాగర్ రావుకు వివరించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై గవర్నర్ తో మాట్లాడారు. జూన్ 21న శుక్రవారం రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు కేసీఆర్.