సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం‌, చినజీయర్‌ స్వామి

సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం‌, చినజీయర్‌ స్వామి

సిద్దిపేట :  కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ‌ను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం నుంచి పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం..మర్కూక్ పంప్ హౌజ్ దగ్గర సుదర్శనయాగం పూర్ణాహుతిలో చినజీయర్ స్వామితో కలిసి పాల్లొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దంపతులు, చినజీయర్‌ స్వామికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

మరికాసేపట్లో మర్కూక్ పంపుహౌజ్‌ ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. తర్వాత కొండపోచమ్మసాగర్‌ కట్ట వద్ద డెలివరీ సిస్టర్న్‌ వద్దకు చేరుకుంటారు. తర్వాత డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజుపూర్‌ లోని రాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12.40 గంటలకు మర్కూక్‌ పంపుహౌజ్‌ వద్దకు చేరుకొని ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..