ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రూ.220 కోట్లు మంజూరు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రూ.220 కోట్లు మంజూరు

మహబూబ్ ​నగర్​ కలెక్టరేట్​/జడ్చర్ల టౌన్, వెలుగు:గత పాలనలో వెనకబాటుకు గురైన ఉమ్మడి పాలమూరు స్వరాష్ట్రంలో తేట పడుతోందని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు.  ఆదివారం  మహబూబ్​నగర్​జిల్లాలో పర్యటించిన ఆయన రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్​నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు పాలమూరుకు చేరుకున్నారు.  ముందుగా పార్టీ జిల్లా ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్​ చేసి  చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డిని స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి సమీకృత కలెక్టరేట్​వద్దకు చేరుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​సీఎంకు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకతలను  ఐదు నిమిషాల పాటు వివరించారు. అనంతరం సీఎం 1.55 నిమిషాలకు బస్సు దిగి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.  తర్వాత సీఎస్​ సోమేశ్​ కుమార్, కలెక్టర్​ఎస్​.వెంకట్రావు సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆర్​అండ్​బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి సమీకృత కలెక్టరేట్​ ప్రారంభోత్సవం సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. అనంతరం సీఎం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి కలెక్టర్​చాంబర్​ వద్దకు వెళ్లి రిబ్బన్​ కట్ చేశారు. కలెక్టర్​ను కూర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం మత పెద్దల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంకు కలెక్టర్​వేంకటేశ్వరుడి చిత్రపటాన్ని ఇచ్చి సన్మానించారు. ఆ తర్వాత సీఎం ఆర్​అండ్​బీ ఆఫీసర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం సీఎం ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం ఇంప్లిమెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న స్కీం గురించి వివరించారు. సమీక్ష అనంతరం మూడు గంటలకు లంచ్​ బ్రేక్​ తీసుకున్నారు. 4.40 గంటలకు  సీఎం సభా స్థలానికి చేరుకొని ప్రసంగించారు. 

పాలమూరుతో ప్రత్యేక అనుబంధం

పాలమూరు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని,  పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్టం సాధించానని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తుచేసుకున్నారు.  రాష్ట్రం రాక ముందు పాలమూరుకు మెడికల్​కాలేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదని,  తాను అధికారంలోకి వచ్చాక ఐదు జిల్లాలకు మెడికల్​ కాలేజీలు మంజూరు చేశానని చెప్పారు.  ఇప్పటికే మూడు ప్రారంభం అయ్యాయని, వచ్చే ఏడాది జూన్​ నుంచి నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కూడా అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు.   జిల్లాలకు వెళ్తే  ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం రూ.10 కోట్లు అడుగుతున్నారన్న ఆయన.. ఉమ్మడి జిల్లాలోని14 నియోజకవర్గాలకు ఏసీడీపీ నిధులు రూ.5 కోట్లతో పాటు అదనంగా రూ.15 కోట్లు కలిపి మొత్తం రూ. 220 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

అలంకరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

సమీకృత కలెక్టరేట్​ వద్ద సీఎం రాక సందర్భంగా ఒగ్గు కళాకారులు,డప్పు కళాకారులు ప్రదర్శనలు  ఆకట్టుకున్నాయి. సభా వేదిక వద్ద మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు కళాకారుడు సాయిచంద్​ ఆధ్వర్యంలో ఆటపాటలతో అలరించారు.

భారీగా తరలివచ్చిన జనం

సీఎం సభకు జనాలు భారీగా తరలివచ్చారు. మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​  వారం ముందు నుంచి  ఎమ్మెల్యేల కోఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో జన సమీకరణ చేయడంతో  సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచే ప్రజలు సభకు వద్దకు రావడంతో ఎండకు ఇబ్బంది పడ్డారు.  కాగా, సీఎం రాక సందర్భంగా పోలీసులు జడ్చర్ల నుంచి పాలమూరు, భూత్పూర్​ వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.  జిల్లా కేంద్రంలోనే దాదాపు 1,340 మంది బందోబస్తులో పాల్గొన్నారు. 

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 

మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, నిరంజన్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు సంతోశ్ కుమార్, రాములు, మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, గోరటి వెంకన్న, దామోదర్​రెడ్డి, నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్​రెడ్డి, బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, అబ్రహం, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్​రెడ్డి, జైపాల్​యాదవ్​, హర్షవర్ధన్​రెడ్డి, ఎస్ ​రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి,  చిట్టెం రామ్మోహన్​రెడ్డి, పట్నం నరేందర్​రెడ్డి సభకు హాజరయ్యారు.

స్పెషల్​ అట్రాక్షన్​గా మల్లారెడ్డి

సీఎం వచ్చేందుకు ఐదు నిమిషాల ముందు మంత్రి మల్లారెడ్డి స్టేజ్​ మీదకు ఎక్కారు. ఆయన రాగానే  ప్రజలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. సీఎం సభలో మాట్లాడుతూ పాలమూరులో మల్లారెడ్డి గాలి బాగుందని కితాబు ఇచ్చాడు.