మళ్లీ మా ప్రభుత్వమే వస్తది

మళ్లీ మా ప్రభుత్వమే వస్తది

వచ్చే ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వమే వస్తుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.‘దళితబంధుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దళితులు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. దేశమంతా ఇదే పరిస్థితి. దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారికి తగినన్ని అవకాశాలు అందడం లేదు. స్వాతంత్రం ముందు నుంచే దళితులు వివక్షకు గురయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ తో బాగుపడ్డోడు ఒక్కడు కూడా లేడు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తది. భూములు అమ్ముతుంటే రాష్ట్రానికి మస్తు ఆదాయం వస్తోంది. వచ్చే బడ్జెట్‎లో దళితబంధుకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తాం. నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం ఎమ్మెల్యేల ఇష్టమే’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

 

ఈమె నోరు విప్పడం వల్లే ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఆగిపోయాయా?

ఆన్‌లైన్‌ గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్

సోషల్​ మీడియాలో ఇలా ఉండాలె