పెట్రో రేట్లపై కేంద్రం ప్రజల్ని మోసం చేస్తుంది

పెట్రో రేట్లపై కేంద్రం ప్రజల్ని మోసం చేస్తుంది

హైదరాబాద్: పెట్రో రేట్లపై కేంద్రం ప్రజల్ని మోసం చేస్తోందన్నారు సీఎం. పెట్రో ధరలపై సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి దోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్రాల వాట ఎగ్గొట్టడానికి సెస్ రూపంలో వసూలు చేస్తున్నార్నారు. ప్రజల్ని మోసం చేయడంతో పాటు.. ప్రజలపై భారం వేశారన్నారు. అంతర్జాతీయంగా రేట్లు పెరగకపోయినా..పెరిగాయంటూ కేంద్రం అబద్దాలు చెప్పిందన్నారు. 4 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయనే ఇప్పుడు రేట్లు తగ్గించారన్నారు. పెట్రో రేట్లు కొండంత పెంచి.. పీసరంత తగ్గించారని మండిపడ్డారు. పైగా రాష్ట్రాలు తగ్గించాలని కేంద్రం చెప్పడం విడ్డూరమన్నారు. పెట్రో  రేట్లపై సెస్ వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం తలచుకుంటే లీడర్ 77 రూపాయలకే అమ్మొచ్చన్నారు. మేం అధికారంలోకి వచ్చాక పెట్రో ల్ పై వ్యాట్ ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు.

కేంద్రం ధాన్యం కొనట్లేదు కాబట్టే.. యాసంగిలో వరి వేయొద్దని చెప్పామన్నారు CM KCR. ధాన్యం కొనుగోలుపై క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు సీఎం. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనబొదని స్పష్టం చేశారు. రైతులు నష్టపోకూడదనే ప్రత్యామ్నాయ పంటలు వెయ్యాలని చెప్పామన్నారు. బాయిల్డ్ రైస్ అసలు తీసుకోమని కేంద్రం చెప్పిందన్నారు. తనను జైలుకు పంపిస్తామంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు సీఎం. కేసీఆర్ ను టచ్ చేసి చూడు అంటూ మాట్లాడారు. తనను టచ్ చేసి బతికి బట్టకట్టగలరా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి నేతపై అడ్డుపొడుగు మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ నేతలు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.