ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి

ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి

ఏడాదిలో వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలన్నారు సీఎం కేసీఆర్. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానన్నారు. వాసాలమర్రిలో పోలీస్ కేసులు ఉండొద్దన్నారు .ఊరంతా ఊరుకోసం  సమిష్టిగా పనిచేయాలన్నారు. ప్రతీ ఇల్లు ఆనందంగా ఉండాలన్నారు. గ్రామంలోని ఆడవాళ్లం పట్టుపట్టి ఊరు బాగుచేయించుకోవాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా  కలిసి పనిచేయాలన్నారు. ఆడవాళ్లు మగవాళ్లకంటే ఇళ్లు, పిల్లల బాగోగులు బాగా చూసుకుంటారన్నారు. పొదుపు బాగా చేస్తారన్నారు.