రాజయ్య ఇంటికి పల్లా.. తాళం వేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

రాజయ్య ఇంటికి పల్లా.. తాళం వేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

హనుమకొండ, వెలుగు: టికెట్ల కేటాయింపులో కొందరు సిట్టింగులు, ఆశావహు లకు సీఎం కేసీఆర్ మొండిచేయి చూపించారు. ప్రస్తు తం వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీఆర్‌‌‌‌‌‌ఎస్ అధిష్టానం ఆ అసంతృప్త నేతలను బుజ్జగిం చే పనిని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య లీడర్లకు అప్పగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ టికెట్‌‌ను సస్పెన్స్‌‌లో పెట్టగా, స్టేషన్​ఘన్‌‌పూర్ టికెట్‌‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటా యించారు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం స్టేషన్ ఘన్‌‌పూర్‌‌‌‌లోని తన క్యాంప్ ఆఫీస్‌‌లో బోరున విలపించారు. అలాగే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 

రాజయ్య ఇంటికి తాళం..

ఎమ్మెల్యే రాజయ్యను బుజ్జగించే పనిని అధిష్టానం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించింది. దీంతో స్టేషన్ ఘన్‌‌పూర్‌‌‌‌లో కడియం శ్రీహరి నిర్వహించే బహిరంగ సభకు హాజరయ్యేందుకు బుధవారం పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందుగా హనుమకొండకు వచ్చారు. బీఆర్‌‌‌‌ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ నేతలతో కలిసి రాజయ్యను బుజ్జగించేందుకు రాజయ్య ఇంటికి వెళ్లారు. కానీ, పల్లాను కలవడానికి ఇష్టపడని రాజయ్య.. ఆయన వెళ్లే సమయానికి అందుబాటులో లేకుండా పోయారు.

ఇంటికి తాళం వేసి ఉండటంతో రాజయ్యకు ఫోన్‌‌ చేశాడు. కడియం శ్రీహరి ర్యాలీలో పాల్గొనేందుకు రావాలని కోరారు. ఇందుకు నిరాకరించిన రాజయ్య.. ప్రస్తుతం వేరే పనిలో ఉన్నానని, తానే స్వయంగా కలుస్తానని పల్లాకు చెప్పినట్లు తెలిసింది. దీంతో పల్లా కొద్దిసేపు అక్కడి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజయ్యకు టికెట్ కేటాయించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని కార్యకర్తలు పల్లా దృష్టికి తీసుకెళ్లారు. వారికి సమాధానం చెప్పిన ఎమ్మెల్సీ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సర్వేలు, గెలుపు అవకాశాల వల్లే కడియంకు టికెట్‌‌: పల్లా

సర్వేలు, గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టు కునే కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాల్సిన అవ సరం ఏర్పడిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డి అన్నారు. రాజయ్య మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని, ఆయన విషయం సీఎం దృష్టిలో ఉందన్నారు. రాజయ్యకు సము చిత గౌరవస్థానం కల్పిస్తానని సీఎం చెప్పారన్నారన్నారు. రెండు మూడ్రోజుల్లో సీఎం కేసీఆర్‌‌‌‌ను కలుస్తామని పల్లా తెలిపారు.