ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రజలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పాలి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ పట్టణంలో రూ.62.20కోట్లతో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్​ను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఆదివారం ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కలెక్టర్ శశాంకతో కలిసి పట్టణంలోని కొత్త కలెక్టరేట్ నిర్మాణాన్ని వారు పరిశీలించారు. పెండింగ్​పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ ను ప్రత్యేక జిల్లాగా చేయడం వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు.

మెడికల్ కాలేజీ వరం..

మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఒక వరమని మంత్రులు అభిప్రాయపడ్డారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో మెడికల్ కాలేజీ రావడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.560కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎంతోకాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న గిరిజన రైతులకు.. త్వరలోనే సీఎం కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తారని తెలిపారు.

లక్ష మందితో సభ..

మహబూబాబాద్ లో నిర్వహించే కేసీఆర్ సభకు లక్ష మందిని తరలిస్తామని మంత్రులు తెలిపారు. ఈమేరకు ఇల్లందు, సలార్ తండా రూట్లలో స్థలాలను పరిశీలించారు. సీఎం టూర్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అయితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కేసీఆర్ పర్యటన ఉంటుందని టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బానోతు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్​అండ్​బీ ఎస్ఈ నాగేందర్ రావు, ఈఈ తానేశ్వర్, డీఈ రాజేందర్ తదితరులున్నారు.

దేవాలయ పునర్​నిర్మాణ పనుల పరిశీలన పర్వతగిరి: వరంగల్​ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రంలోని పర్వతాల శివుని ఆలయ పునర్ నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరిశీలించారు. వచ్చే నెల 19న ఈ టెంపుల్ ను ఓపెనింగ్​ చేస్తామన్నారు.
ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి.

తొర్రూరు:  ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సూచించారు. ఆదివారం రాత్రి తొర్రూరు హైస్కూల్​లో నిర్వహించిన కోటి దీపోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పలు మండలాల నుంచి భక్తులు హాజరై కోటి దీపాలను వెలిగించారు.

బీమారాన్ని అభివృద్ధి చేస్తాం

హసన్ పర్తి, వెలుగు: వరంగల్ బల్దియా 53,55వ డివిజన్లలోని బీమారం కాలనీని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్​అన్నారు. ఆదివారం కాలనీలో రూ.కోటి 60లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక డీపీఆర్ సిద్ధం చేసి, కాలనీని డెవలప్ చేస్తామన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత, సిరంగి సునీల్, డివిజన్ అధ్యక్షులు  తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో 5కె రన్

విన్నర్లకు సైకిళ్లు, నగదు బహుమతులు

వర్ధన్నపేట, వెలుగు: సైబర్ అవేర్ నెస్ పేరుతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఆదివారం పోలీసులు 5కె రన్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్టుగా సీపీ తరుణ్ జోషి, ఎమ్మెల్యే అరూరి రమేశ్​హాజరయ్యారు. స్థానిక వివేకానంద విగ్రహం నుంచి ఇల్లంద వరకు పరుగు తీశారు. పోలీసులతో పాటు పట్టణ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్పోర్ట్స్ సైకిళ్లు అందజేయగా.. మరో ఐదుగురికి నగదు బహుమతులు అందజేశారు.

యువతతోనే సైబర్ క్రైమ్ నివారణ..

సైబర్ క్రైమ్ అంతం యువతతోనే సాధ్యమని సీపీ తరుణ్ జోషి అన్నారు. లోన్ యాప్స్, ఫేక్ కాల్స్, గుర్తు తెలియని వెబ్ లింక్స్, కాల్స్​కు స్పందించవద్దన్నారు. ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. ఈ తరహా మోసాలపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్​కు కాల్ చేయాలని, 24గంటల్లో చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. మొబైల్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ సదన్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, కమిషనర్ రవీందర్, జడ్పీటీసీ భిక్షపతి, ఎంపీపీ అప్పారావు తదితరులున్నారు.

రోడ్లపై వడ్లు పోయొద్దు

రైతులకు పోలీసుల అవగాహన

కమలాపూర్, వెలుగు: రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వడ్లను రోడ్లపై పోయవద్దని పోలీసులు సూచించారు. ఈమేరకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆదివారం కమలాపూర్ మండల రైతులకు అవగాహన కల్పించారు. ఇటీవల మండలంలోని శనిగరం శివారులో వడ్ల కుప్పల వల్ల ముగ్గురు మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వడ్ల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ప్రమాదాలకు రైతులు కారకులు కావొద్దని సూచించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్​లోనూ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ సంజీవ్, ఎస్సై చరణ్ ఉన్నారు.

రైతులకు పోలీసుల అవగాహన

కమలాపూర్, వెలుగు: రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వడ్లను రోడ్లపై పోయవద్దని పోలీసులు సూచించారు. ఈమేరకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆదివారం కమలాపూర్ మండల రైతులకు అవగాహన కల్పించారు. ఇటీవల మండలంలోని శనిగరం శివారులో వడ్ల కుప్పల వల్ల ముగ్గురు మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వడ్ల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ప్రమాదాలకు రైతులు కారకులు కావొద్దని సూచించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్​లోనూ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ సంజీవ్, ఎస్సై చరణ్ ఉన్నారు.

‘కుడా’కు కాసుల పంట!

  •     మడిపెల్లిలో ‘మా సిటీ’ ప్లాట్ల వేలానికి స్పందన
  •     గజానికి కనిష్ట ధర రూ.8 వేలు నిర్ణయించిన ఆఫీసర్లు
  •     గరిష్టంగా రూ.17,050  పలికిన భూములు

హనుమకొండ, హసన్​ పర్తి, వెలుగు: కాకతీయ అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ(కుడా) ఆధ్వర్యంలో హసన్​పర్తి మండలం మడిపెల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ‘మా సిటీ’ లేఅవుట్ లో ప్లాట్ల వేలానికి మంచి స్పందన లభించింది. దాదాపు 150 ఎకరాల్లో మొత్తం 99 రెసిడెన్సీ.. 1,015 ఫాంహౌస్​ప్లాట్లు ఉండగా..  ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైన ప్లాట్ల వేలం రాత్రి  7.20  గంటల వరకు కొనసాగింది. ఆదివారం రెండు సెక్టార్లలో వేలం ప్రక్రియ నిర్వహించగా.. సెక్టార్​వన్​లో 25 ప్లాట్లకు గాను 24 ప్లాట్లకు వేలం వేశారు. అధికారులు కనీస ధర గజానికి రూ.8 వేలు నిర్ణయించగా..  బిడ్డర్లు గరిష్టంగా రూ.17,050 ధర వరకు పాడారు. కాగా మొట్టమొదట వేలానికి పెట్టిన ప్లాట్​ను గజానికి రూ.12,250 రేటుతో రాజబ్రహ్మం అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.  ఇక రెండో సెక్టార్ లో 57 ప్లాట్లకు గానూ 27  రెసిడెన్షియల్ ప్లాట్లను గజానికి రూ.8 వేలతో వేలానికి పెట్టారు. కాగా ఇందులో గరిష్ఠంగా గజానికి రూ.15,700తో బిడ్డర్లు కొనుగోలు చేశారు.

90రోజుల గడువు..

 వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.25వేలు డిపాజిట్ చెల్లించారు. కొనుగోలు చేసిన ప్లాట్లకు మూడు రోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలని, మిగతా 75 శాతం  డబ్బులు 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందని కుడా ఆఫీసర్లు  తెలిపారు. ఈ సందర్భంగా కొనుగోలుదారుల సౌకర్యార్థం వివిధ బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు స్థానికంగా కౌంటర్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్​సుందర్​ రాజ్​యాదవ్​ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ప్లాట్ల వేలం జోరుగా కొనసాగుతోందన్నారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా వేలం పాటను అందరి సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  కుడా వైస్ చైర్మన్, గ్రేటర్​ కమిషనర్​ ప్రావీణ్య మాట్లాడుతూ గతం లో ఓసిటీ లో ‘కుడా’ తరపున విజయవంతంగా వేలం పాటలు నిర్వహించినట్లు తెలిపారు. ‘మాసిటీ’ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ సిస్టం, రోడ్లు తదితర ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. ఈ వేలం పాటలో కుడా ప్లానింగ్​ ఆఫీసర్​ అజిత్​ రెడ్డి, సెక్రటరీ డా.మురళీధర్​ రావు, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.