త్వరలో జిల్లాల పర్యటనకు కేసీఆర్.!

త్వరలో జిల్లాల పర్యటనకు కేసీఆర్.!

ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికావడంతో జిల్లాల పర్యటనపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్.  త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం వెళ్లనున్నట్లు సమాచారం. కలెక్టర్ కార్యాలయాలు,పార్టీ ఆఫీస్ లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జిల్లాల్లో ముందుగా పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల 4,5 జిల్లాలకు వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.గత నెల 10న సీఎం వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది.  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో పర్యటన రద్దయింది.

ముందుగా వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు సమాచారం.ఇక్కడ  సమీకృత భవనాలను ప్రారంభానికి సిద్ధం చేశారు అధికారులు.నియోజకవర్గలలో పార్టీ భవనాలు దాదాపు పూర్తి అయ్యాయి. సీఎం పర్యటనలోనే వీటిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.జిల్లాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోట, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం రాని నేతలతో సీఎం మాట్లాడనున్నట్లు సమాచారం. వీరికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలోనూ సీఎం పర్యటించనున్నట్లు సమాచారం.తాండూరులో టీఆర్ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం నడుస్తోంది.జిల్లాల పర్యటనలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను సీఎం విజిట్ చేసే అవకాశం ఉంది. జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల ఏర్పాటుపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.