కేరళ గోల్డ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో సీఎం పినరయి!

కేరళ గోల్డ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో సీఎం పినరయి!

స్పీకర్‌‌‌‌, ముగ్గురు మంత్రులు కూడా..
ఆ రాష్ట్ర హైకోర్టుకు వెల్లడించిన కస్టమ్స్‌‌‌‌ శాఖ
వివరాలన్నీ నిందితురాలు స్వప్న చెప్పినట్టు వెల్లడి

కొచ్చి: బంగారం, కరెన్సీ స్మగ్లింగ్‌‌‌‌ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌‌‌‌కు సంబంధముందని ఆ రాష్ట్ర హైకోర్టులో కస్టమ్స్‌‌‌‌ శాఖ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్‌‌‌‌ ఈ విషయాన్ని చెప్పినట్టు తెలిపింది. సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌‌‌‌ శ్రీరామకృష్ణన్, ముగ్గురు మినిస్టర్లకూ సంబంధమున్నట్టు చెప్పిందని పేర్కొంది. ‘యూఏఈకి చెందిన కాన్సుల్‌‌‌‌ జనరల్‌‌‌‌తో పినరయికి దగ్గరి సంబంధాలున్నాయని స్వప్న చెప్పింది. విదేశీ సొమ్మును కాన్సులేట్‌‌‌‌ సాయంతో స్మగ్లింగ్‌‌‌‌ చేశారంది. ఇంకా చాలా మంది హై ప్రొఫైల్‌‌‌‌ వ్యక్తులకు కేసుతో సంబంధం ఉందని, వాళ్లకు ముడుపులు అందాయని వివరించింది’ అని కస్టమ్‌‌‌‌ శాఖ కమిషనర్ సుమిత్ కుమార్ కోర్టుకు చెప్పారు.

ట్రాన్స్‌‌‌‌లేటర్‌‌‌‌గా స్వప్న

‘డబ్బుల స్మగ్లింగ్‌‌‌‌కు సంబంధించి తనకంతా తెలుస ని స్వప్న చెప్పింది. ఆ ట్రాన్సాక్షన్స్‌‌‌‌కు తానే ప్రత్యక్ష సాక్షినని వెల్లడించింది. తనకు అరబిక్‌‌‌‌ తెలుసని, వాళ్ల మధ్య ట్రాన్స్‌‌‌‌లేటర్‌‌‌‌గా తానే ఉన్నానని వివరించింది. యూఏఈ కాన్సులేట్‌‌‌‌, కేరళ రాజకీయ నాయకుల మధ్య మధ్యవర్తి మాజీ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ ఎం.శివశకంర్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేరుతో డబ్బులను యూఏఈ తరలించారంది’ అని కోర్టుకు కస్టమ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ తెలిపింది. పెద్ద వాళ్ల పేరు చెప్పొద్దని స్వప్నకు బెదిరింపులు వచ్చాయని, జైలులో ఉన్నప్పుడు కస్టమ్స్‌‌‌‌ అధికారులు ఆమెను కలవకుండా అడ్డుకున్నారని కూడా చెప్పింది. కాగా, గోల్డ్‌‌‌‌ స్మగ్లింగ్‌‌‌‌కు సంబంధించి మనీలాండరింగ్‌‌‌‌ వ్యవహారంలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌‌‌‌పై ఉన్న సస్పెండెడ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారి శివశంకర్‌‌‌‌కు ఆ బెయిల్‌‌‌‌పై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది.

2020 జులై 5 రోజు..

2020లో జులై 5న యూఏఈ నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని కొచ్చి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచ నా వేశారు. డిప్లొమాటిక్ రూట్‌‌‌‌లో ఇంత భారీగా బంగారం తరలించడంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థలు ఎన్‌‌‌‌ఐఏ, కస్టమ్స్, ఎన్‌‌‌‌ఫోర్స్ డైరెక్టరేట్‌‌‌‌లు విడివిడిగా విచారణ చేపట్టాయి.