హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్:సీఎం రేవంత్ రెడ్డి

హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ట్యాంక్ బండ్, తెలంగాణ అమరవీరుల జ్యోతి, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వరకు గుండ్రంగా స్కై వాక్ వే డిజైన్ చేయాలని అధికారులకు సూచించారు. అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయస్థాయి డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందంగరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

గోల్కొండ చుట్టూ ఇరుకుగా ఉన్న రోడ్లను విశాలంగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్. ఆక్రమణలు ఉంటే తొలగించాలన్నారు. రోడ్ల విస్తరణలో స్థానికులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఎవరైనా ఉంటే వారికి వేరే చోట పునరావాసం కల్పించాలని చెప్పారు. 

రాష్ట్రంలో టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి బుద్ధ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పా రు. సాగర్ లో బుద్ధవనాన్ని టూరిజం హబ్ గా, స్పిరిచువల్ డెస్టినెషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామన్నారు. 

నాగార్జున డ్యామ్ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధ వనా న్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నాగార్జున సాగర్ సందర్శకకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వరకు బోట్ లో విహరించే ఏర్పాట్లు పునురుద్ధి రించాలని సీఎం నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తామని చెప్పారు.  హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారి నిర్మిస్తామని తెలిపారు. 

ALSO READ | కాళేశ్వరంపై విచారణకు కమిషన్ గడువు పెంపు

రాష్ట్రంలోని బౌద్ధరామాలు, పర్యాటక స్థలాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. చారాత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సూచించారు.