సీఎం రేవంత్‌‌‌‌తో సునీల్ కనుగోలు భేటీ

సీఎం రేవంత్‌‌‌‌తో సునీల్ కనుగోలు భేటీ
  •  ఎంపీ ఎన్నికల వ్యూహాలపై చర్చ!

హైదరాబాద్,వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్‌‌‌‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కను గోలు భేటీ అయ్యారు. బుధవారం హైదరాబా ద్‌‌‌‌కు వచ్చిన ఆయన.. మధ్యాహ్నం సెక్రటేరియెట్‌‌‌‌లో రేవంత్‌‌‌‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కనుగో లు సీఎంతో భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్ మున్షితోనూ సునీల్ సమావేశమయ్యారు.

పొంగులేటి, సునీల్ కలిసి సెక్రటేరి యెట్‌‌‌‌లో రేవంత్‌‌‌‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లోక్‌‌‌‌సభ ఎన్నికలపై చర్చ జరిగినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సెగ్మెంట్లలో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించినట్టు సమాచారం. పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.