
- అధికారులతో సమావేశం నిర్వహించిన అడిషనల్ కలెక్టర్ అమరేందర్
వంగూరు, వెలుగు: ఈ నెల 19న సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిని సందర్శించనున్నారు. ఈ మేరకు శనివారం వివిధ శాఖల అధికారులతో అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సమావేశంనిర్వహించారు. అనంతరం హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి 19న అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. ..
అక్కడి నుంచి నేరుగా కొండారెడ్డిపల్లికి చేరుకొని మధ్యాహ్నం భోజనం చేస్తారని, గ్రామంలో సీఎం సొంత నిధులు రూ.3 కోట్లతో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్మురళీమోహన్, ఎంపీడీవో బ్రహ్మచారి, పీఆర్ ఏఈ మణిపాల్ నాయక్, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేందర్, ఎనుముల వేమారెడ్డి పాల్గొన్నారు. ..