సీఎం చదివిన స్కూల్ ను..రాష్ట్రానికే తలమానికంగా తీర్చుదిద్దుతాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

సీఎం చదివిన స్కూల్ ను..రాష్ట్రానికే తలమానికంగా తీర్చుదిద్దుతాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి వనపర్తిలో చదువుకున్న స్కూల్, జూనియర్​ కాలేజీని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. స్కూల్, కాలేజీ డెవలప్ మెంట్​కు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని చెప్పారు.

సోమవారం కలెక్టర్​  ఆదర్శ్​ సురభితో కలిసి జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్​​హైస్కూల్​ గ్రౌండ్​లో బిల్డింగ్​ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ భవనం పూర్తయితే విద్యార్థులకు మెరుగైన సౌలతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్​కు సూచించారు.

అనంతరం మరికుంట మెడికల్  కాలేజీ సమీపంలో 20 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్  బిల్డింగ్​కు భూమిపూజ చేశారు. ఏఎంసీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు బి.కృష్ణ, బ్రహ్మంచారి, సాయి చరణ్ రెడ్డి, ఎస్ఎల్ఎన్​ రమేశ్, చిన్నకృష్ణ, చీర్లసత్యం పాల్గొన్నారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ..

రేవల్లి/ఏదుల: రేవల్లి, ఏదుల మండలాలకు సంబంధించిన మహిళలకు సోమవారం గోపాలపేటలోని పద్మావతి ఫంక్షన్  హాల్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్  ఆదర్శ్  సురభి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

డీఆర్డీవో ఉమాదేవి, అడిషనల్​ డీఆర్డీవో సుజాత, డిప్యూటీ కలెక్టర్  రంజిత్ రెడ్డి, నాయకులు సత్యశీలారెడ్డి, జమ్మి మల్లేశ్, సురేశ్ గౌడ్, సుల్తాన్  అలీ, వేణుగోపాల్, లింగస్వామి, మిద్దె రాములు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప  పాల్గొన్నారు.-