
గత పాలకులు భూమిని చెరబట్టాలని ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న లక్షల ఎకరాల భూముల లెక్కలు తెలియకుండా ఉండేందుకే VRO, VRA, రెవెన్యూ అధికారులను తొలగించారని విమర్శించారు. వాళ్ల దోపిడీని ప్రజలకు వివరించేది వీఆర్వో, వీఆర్ఏలే నని.. అందుకే వారినే టార్గెట్ చేశారని అన్నారు. అందుకే ప్రజల ముందు రెవెన్యూ అధికారులను దోషులుగా చిత్రీకరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల మంది గ్రామ పాలన అధికారులను నియమించిన సందర్భంగా.. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా సీఎం రేవంత్ హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కామెంట్స్.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
- పల్లెల్లో తెలంగాణ ఉద్యమంలో భావవ్యాప్తి కోసం ఉపాధ్యాయులు పనిచేశారు
- ఉద్యోగులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు, విద్యార్థులు పనిచేశారు
- వారి సమస్యలు తొలగించి.. వారికి గుర్తింపు ఇస్తారని ఎదురు చూశారు
- కానీ గత పాలకులు రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు
- భూమికి, తెలంగాణ ప్రజలకు విడదీయరానికి సంబంధం ఉంది
- తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టే తిరిగాయి
- ఆనాడు జల్- జంగల్- జమీన్ నినాదంతో ఆదివాసీల కోసం కొమ్రంభీం కొట్లాడింది భూమికోసమే
- చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య మొదలైన అమరలు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేశారు
- ఉమ్మడి రాష్ట్రంలో.. సైమైక్య రాష్ట్రంలో మన భూమిని చెరబడుతున్నరని తెలంగాణ ఉద్యమం మొదలైంది
- భూదాన్ పోచంపల్లి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఈ గడ్డ పైనే
- నక్సల్ బరీ ఉద్యమంలో దున్నేవాడిదే భూమి అని నక్సల్ నినాదం ఇస్తే..
- ఇందిరా గాంధీని ఒప్పించి 25 లక్షల భూపంపకాలు ఈ గడ్డమీద జరిగాయి
- పేదలకు పోడు భూమి 10 లక్షల భూములు పంపకాలు జరిగాయి
- భూమికి, తెలంగాణ బిడ్దకు మధ్య తల్లికీ బిడ్డకు ఉన్న అవినాభవ సంబంధం ఉంది.
- భూమిని ఆక్రమించుకోవాలని అనుకున్న వాడిని ఈ ప్రాంత ప్రజలు దిగంతాలకు తరిమికొట్టిన చరిత్ర
- ఆనాడు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు.. సమ్మక్క సారళమ్మ సాక్షిగా.. వివిధ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లిన
- ధరణి భూతంగా మారింది.. కొరివి దెయ్యం నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు చెప్పారు
- అందుకే రాహుల్ గాంధీని ఒప్పించి దానికి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పాం
- దీనికి తోడుండే మంత్రి ఉండాలని రెవెన్యూ శాఖకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని నిర్ణయించాం
- ఆయనైతేనే ధరణి మహమ్మారిని తరిమికొడతారని ఆయనను నియమించాం
- ఎన్నో చర్చలు, విశ్లేషణల తర్వాత భూభారతి-2025 చట్టం ద్వారా ధరణికి పాతరేశాం
- తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన రాతలు మార్చుతారని భావించాం
- గత పాలకులు అధికారం అంతా తహసీల్దార్, రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ కు అప్పగించారు.
- దీంతో భూసమస్యలు పరిష్కారం కాకపోవడంతో తహసీల్దార్లపైన, వీఆర్వో, వీఆర్ ఏలపై.. రెవెన్యూ అధికారులపై దాడులు చేసేలా చేశారు
- గ్రామపాలనా అధికారులుగా రెవెన్యూ అధికారులు మళ్లీ బాధ్యతుల తీసుకున్నాక.. గత ప్రభుత్వం కొల్లగొట్టిన భూములను గ్రామ పాలన అధికారులుగా మీరు బయటకు తీయాలి
- అందుకే 5 వేల మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నాం
- గత దోపిడీలు వెలికి తీసి.. భూభారతి చట్టం అమలు కావాలంటే.. పేదలకు న్యాయం జరగాలంటే మీరు ఉండాలి
- సాదా బైనామాల అప్లికేషన్లు ఎదురు చూస్తున్నాయి..
- ధరణి దరిద్ర్యాన్ని వదిలించడంతో పాటు సాదా బైనామాల సమస్యలు పరిష్కరించాలి
- రెవెన్యూ శాఖలో ఎవరో ఒకరు తప్పు చేయవచ్చు.. కానీ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడమేంటి..
- వాళ్ల దొంగతనాన్ని తప్పిపుచ్చుకునేందుకు మిమ్మల్ని తొలగించారు
- రేషన్ కార్డులు, సన్నబియ్యం, భూసంస్కరణలు తీసుకొద్దాం అనుకున్నపుడు.. రెవెన్యూ అధికారులు లేని లోటు.. వీఆర్వో, వీఆర్ఏ లు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
- ప్రభుత్వం రెవెన్యూ అధికారులపై దుర్మార్గంగా ముద్ర వేసింది.. పచ్చబొడిసినట్లు.. ముద్ర వేశారు
- మళ్లీ నియమిస్తే.. రైతులకు నష్టం జరుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టించి.. రెవెన్యూ అధికారుల మీద..ప్రభుత్వం మీద నెగెటివ్ తీసుకురావచ్చని అనుకున్నారు..
- కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి పార్టీని రద్దు చేస్తారా..లేదంటే వీళ్లను తొలగించినట్లు వీళ్లను తొలగిస్తారా.. అని గ్రామ పాలనా అధికారులు గ్రామ గ్రామాన అడుగుతరు.. తమను తాము రక్షించుకుంటరు .. ప్రజల కష్టాలు తీరుస్తరు..
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యత తీసుకుని మిమ్మల్ని నియమించే బాధ్యత తీసుకున్నడు
- ఎలాంటి చెడ్డ పేరు రాకుండా.. భూభారతి అమలు చేస్తూ సాదాబైనామాలను కూడా పరిష్కారం చేసేలా పనిచేయాలి.
- భూమిని చెరబట్టిన నిజాం, రజాకర్, జాగీర్దార్ లకు ఏ గతి పట్టిందో.. అలాంటి గతి గత పాలకులకు పట్టించారు.. అందుకే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది
- రెవెన్యూ అధికారులపై వాళ్ల టీవీలు, పేపర్లలో విష ప్రచారాన్ని కల్పించారు
- అందుకే జాగ్రత్తగా ఉండాలి..
- గతంలో ఏ ముద్ర వేశారో.. ఆ ముద్రను తొలగించేలా పనిచేయాలి
- ధరణి పేరున జరిగిన మోసాలను ప్రజలకు చెప్పేలా పని చేయాలి.. ప్రతిజ్ఞ చేయాలి
- గ్రామాలకు వెళ్లండి.. ప్రజా సమస్యలు తెలుసుకోండి.. పరిష్కరించండి.. ప్రభుత్వం మీకు తోడు ఉంటుంది..
- పరిపాలన చేయలేడని నా మీద వస్తున్న ఆరోపణలు.. అవినీతి చేస్తారని మీమీద వస్తున్న ఆరోపణలు తప్పు అని నిరూపించేలా పనిచేయాలి.