ఇయ్యాల నారాయణపేటలో కాంగ్రెస్ సభ .. ప్రచారం ప్రారంభించనున్న సీఎం రేవంత్

ఇయ్యాల నారాయణపేటలో కాంగ్రెస్ సభ .. ప్రచారం ప్రారంభించనున్న సీఎం రేవంత్

నారాయణపేట, వెలుగు: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక్కడ నిర్వహించనున్న జన జాతర సభలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి సీఎం పాల్గొంటారు. స్థానిక మినీ స్టేడియంలో జరగనున్న ఈ సభకు పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

రేవంత్ సోమవారం సాయంత్రం 4.45కు హెలికాప్టర్ లో  నారాయణపేటకు చేరుకుని, 5 గంటలకు మినీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరిగి వెళ్తారు. సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్​చార్జి శివకుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎస్పీ యోగేశ్​గౌతమ్ సభాస్థలి, హెలిప్యాడ్​ను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.