హైదరాబాద్ మియాపూర్లో సీఎంఆర్ మాల్ ప్రారంభం

హైదరాబాద్ మియాపూర్లో సీఎంఆర్ మాల్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీతోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్స్​టైల్​, జ్యూయలరీ స్టోర్లు నిర్వహించే సీఎంఆర్​షాపింగ్​ మాల్ విస్తరణ బాట పట్టింది.​హైదరాబాద్​లోని మియాపూర్​లో బుధవారం కొత్త స్టోర్​ను అందుబాటులోకి తెచ్చింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దీనిని ప్రారంభించారు. రిటైర్డ్​ఐఏఎస్​ దాసరి శ్రీనివాసులు, కార్పొరేటర్​జగదీశ్వర రావు తదితరులు చీఫ్​ గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా సీఎంఆర్​ఫౌండర్​, చైర్మన్​ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు గత 40 ఏళ్లుగా తమ సంస్థను ఎంతగానో ఆదరిస్తున్నారని, నాలుగు రాష్ట్రాల్లో తమకు 40కిపైగా శాఖలు ఉన్నాయని చెప్పారు.

సీఎంఆర్లో షాపింగ్​ప్రపంచస్థాయి అనుభూతిని ఇస్తుందని, అన్ని రకాల వేడుకలకు కావాల్సిన వస్త్రాలను కొనుక్కోవచ్చని చెప్పారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను అతి తక్కువ ధరలకు ఇస్తున్నామని రమణ వివరించారు. సీఎంఆర్​జ్యూయలరీ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు నగలపై ఫ్లాట్​9 శాతం తరుగు, కేజీ వెండి నగలపై రూ.12,500 తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీనటులు మృణాల్​ ఠాకూర్, బుల్లిరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.