సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 

సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలిగించే పనులకు ఆటంకం కలిగింది.

కిష్టారం ఓసీలో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలిగింపు పనులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు  సింగరేణి ప్రాజెక్టు అధికారులు. గనుల్లో భారీగా వరద నీరు చేరటంతో  చిత్తడిగా మారింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

గనుల్లో నిలిచిన వర్షపు నీటిని మోటర్ల సాయంతో బయటకు తోడేసి బొగ్గు ఉత్పత్తి పనులు ప్రారంభిస్తామన్నారు సింగరేణి అధికారులు.