శ్రీశైల ఆలయ గోపురంపై నాగుపాము

శ్రీశైల ఆలయ గోపురంపై నాగుపాము

శ్రీశైలంలో ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము కలకలం రేపింది. ఈరోజు(అక్టోబర్ 15) నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీకి గోపురంని ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బందికి నాగుపాము కనిపించింది. దీంతో ఆలయ సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే దేవస్థానం అధికారులకు తెలియజేశారు. దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్ కాళీ చరణ్ కి సమాచారం ఇవ్వడంతో.. అతను శివాజీ గోపురంపైకి ఎక్కి నాగుపాముని పట్టుకొని అడవి ప్రాంతంలో పాముని వదిలేశాడు. 

Also Read : మేరీలాండ్‌లో ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ


దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయిన రోజే శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యేక్ష్యం కావడంతో.. ఉత్సవాలను తిలకించేందుకు నాగుపాము వచ్చిందని భక్తులు చర్చించుకుంటున్నారు.