త్వరలో భారత్‌‌‌‌లోకి కోకాకోలా ఫోన్

త్వరలో భారత్‌‌‌‌లోకి కోకాకోలా ఫోన్

కోకాకోలా ఫోన్ త్వరలో భారత్‌‌‌‌లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ తనకు తెలియజేసిందని ఒక టిప్​స్టర్​ వెల్లడించాడు. కోకాకోలా ఫోన్ ఈ ఏడాది మొదటి క్వార్టర్​లో భారత్‌‌కు రానున్నట్లు సమాచారం. కోకా-కోలా హ్యాండ్‌‌సెట్‌‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రియల్​మీ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్‌‌తో కలిసి పనిచేస్తోందని తెలుస్తోంది.   ఇందులో మీడియాటెక్​ హీలియో జీ99 చిప్, 6.4-అంగుళాల స్క్రీన్​, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ కూడా ఉంటుంది. ఫోన్  ఫాస్ట్ ఛార్జింగ్‌‌ను కూడా సపోర్ట్​ చేస్తుందని టిప్​స్టర్​ తెలియజేశాడు.